ఆ ఇద్దరికీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్..గోపాల గోపాల సినిమా తర్వాత ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇంతకీ..ఆ రెండు సినిమాలు ఏమిటంటే..భలే భలే మగాడివోయ్..చిత్రంతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించి సూపర్ సక్సెస్ సాధించిన మారుతి డైరెక్షన్ లో వెంకీ ఓ మూవీ చేస్తున్నాడట.
అలాగే మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న క్రాంతి మాధవ్ తో మరో మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే క్రాంతి మాధవ్ తో అనుకున్నప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే క్రాంతి మాధవ్ కు కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ రెండు సినిమాలను దసరా రోజున ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ రెండు చిత్రాలను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments