ఆ ఇద్ద‌రికీ.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంకీ

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

విక్ట‌రీ వెంక‌టేష్..గోపాల గోపాల సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వెంక‌టేష్ ఒకేసారి రెండు సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. ఇంత‌కీ..ఆ రెండు సినిమాలు ఏమిటంటే..భ‌లే భ‌లే మ‌గాడివోయ్..చిత్రంతో క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అందించి సూప‌ర్ సక్సెస్ సాధించిన మారుతి డైరెక్ష‌న్ లో వెంకీ ఓ మూవీ చేస్తున్నాడ‌ట‌.

అలాగే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న క్రాంతి మాధ‌వ్ తో మ‌రో మూవీ చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే క్రాంతి మాధ‌వ్ తో అనుకున్న‌ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే క్రాంతి మాధ‌వ్ కు కూడా వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ రెండు సినిమాల‌ను ద‌స‌రా రోజున ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు చిత్రాల‌ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సురేష్ బాబు నిర్మించ‌నున్నారు.

More News

బాహుబ‌లి 2 లో సూర్య‌

వెండితెర అద్భుతంగా బాహుబ‌లిని తెర‌కెక్కించి.. ప్ర‌పంప వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించి..తెలుగు వారంద‌రూ గ‌ర్వించేలా చేసిన ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి.

స‌రైనోడు ఏం చేస్తున్నాడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా, సెకెండ్ హీరోయిన్ గా కేథ‌రిన్ న‌టిస్తుంది.

న‌య‌న‌తార పాత్ర‌లో స‌మంత‌?

త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన చిత్రం 'త‌ని ఒరువ‌న్‌'. తెలుగులో ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఏ స్టార్ హీరో గొప్ప‌కాదంటున్న ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి 2 కోసం రెడీ అవుతున్న ప్ర‌భాస్ తాజాగా మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

సోనాల్ ముచ్చ‌ట తీరుతుందా?

'రెయిన్ బో' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. 'లెజెండ్' సినిమాతోనే తెలుగులో తొలి హిట్‌ని సొంతం చేసుకుంది సోనాల్ చౌహాన్‌.