వెంకటేష్‌తో వెంకీ అట్లూరి?
Send us your feedback to audioarticles@vaarta.com
'తొలి ప్రేమ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం యువ కథానాయకుడు అఖిల్‌తో తన రెండో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు వెంకీ. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.
ఇంతలోపే.. మరో ప్రాజెక్ట్ ఓకే అయిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నారని తెలుస్తోంది. సురేష్ బాబుతో పాటు మరో నిర్మాత కూడా ఈ సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం వెంకటేష్.. వరుణ్ తేజ్‌తో `ఎఫ్ 2`, నాగచైతన్యతో `వెంకీ మామ` (ప్రచారంలో ఉన్న పేరు) చేస్తున్నారు. ఆ సినిమాలు పూర్తయ్యాకే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com