నాగార్జున చిత్రం లో వెంకటేశ్వర స్వామి ఇతనేనా ?

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లో రూపొందనున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ చిత్రం ఈ నెల 25 న ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం లో వెంకటేశ్వర స్వామిగా నటించేందుకు కొత్త ఆర్టిస్ట్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. గతంలో అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ నటించిన విషయం తెలిసిందే.

ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది .