Venkatesh Daughter:కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం..

  • IndiaGlitz, [Saturday,March 16 2024]

దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. విక్టరీ వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం శుక్రవారం రాత్రి సింపుల్‌గా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు తనయుడు డాక్టర్ నిషాంత్‏‌తో వెంకటేష్ రెండో కూతురు హ‌వ్య‌వాహిని వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకని కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి కేవలం దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు మాత్రమే హజరయ్యాయి.. రానా, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, అభిరామ్‌లు మాత్రమే ఈ వేడుకలో సందడి చేశారు.

ఇక గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్‌‌కు హీరో మహేష్ సతీమణి నమ్రత, ఆయన కూతురు సితార కూడా హజరై సందడి చేశారు. అలాగే సీనియర్ హీరోయిన్ టబూ, సీనియర్ దర్శకడు జయంత్ సి పరాన్జీ వంటి ప్రముఖులు వచ్చారు. కాగా గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు హాజరయ్యారు. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. ఇప్పుడు రెండో కుమార్తె వివాహం జరగ్గా.. మూడో అమ్మాయి వివాహం జరగాల్సి ఉంది.

అలాగే వెంకీ మామ సినిమాల విషయానికొస్తే తన 75వ చిత్రం 'సైంధవ్' మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో తనకు వరుస హిట్స్ ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంతో కొత్త సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. ఈ సినిమా ద్వారా మరోసారి హిట్ ట్రాక్‌లోకి రావాలని వెంకీ భావిస్తున్నారు.

More News

Mudragada: కాపుల్లో చెరగని 'ముద్ర'గడ.. వైసీపీలో చేరికతో విపక్షాల్లో అలజడి..

దశాబ్దాలకు కాపులకు పెద్దగా వ్యవహరిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం అప్పటి తెలుగుదేశం

Kavitha Arrest: బిగ్ బ్రేకింగ్: లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు.

నిజంకాని సీ-ఓటర్‌ సర్వేలు.. పచ్చ తమ్ముళ్లను చూసి నవ్వుకుంటున్న జనాలు..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి.

Sharmila: అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు ఎవరో కాదని.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు.

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు.. గులాబీ నేతల్లో టెన్షన్..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది.