వెంకటేశ్, వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ కొత్తదనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్టరీ వెకంటేశ్... ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందనున్న మల్టీస్టారర్ `ఎఫ్ 2`. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` హ్యాట్రిక్ విజయాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న జూన్ మొదటివారంలో లాంఛనంగా ప్రారంభం కానుంది.
జూన్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉన్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments