వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ 'ఎఫ్ 2' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,May 07 2018]

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌... ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్ 2'. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ట్యాగ్ లైన్‌.  ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్నారు. 'ప‌టాస్‌', 'సుప్రీమ్‌', 'రాజా ది గ్రేట్‌' హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌నున్న జూన్ మొద‌టివారంలో లాంఛ‌నంగా ప్రారంభం కానుంది.

జూన్ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని యూనిట్ స‌భ్యులు తెలిపారు.

More News

ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల ప్రధానోత్సవం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) - దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని

మే 12 నుండి బ్యాంకాక్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను చిత్రం

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా 'టిక్ టిక్ టిక్‌' గ్రాండ్ రిలీజ్‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

స్టార్ ప్రొడ్యూస‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రాలు?

‘అర్జున్ రెడ్డి’ విజయంతో యూత్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి ప్ర‌ముఖ‌ నిర్మాతలు ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలో పాట పాడ‌నున్న పెంచ‌ల్ దాస్‌?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో