వెంకీ, వ‌రుణ్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]


విక్ట‌రీ వెంకటేష్,  మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్క‌నున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులలో భాగంగా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కథానాయికలుగా తమన్నా, మెహరీన్‌లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిల్ గత చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్‌నే ఎంపిక చేస్తారని అందరూ అనుకున్నారు.

అయితే అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ను సెలెక్ట్ చేసారు దర్శకుడు. గతంలో వెంకటేష్, డీఎస్పీ కాంబినేషన్‌లో ‘తులసి’, ‘నమో వెంకటేశ’ చిత్రాలు రాగా.. ముచ్చటగా మూడోసారి వెంకీ సినిమాకి స్వరాలను అందిస్తున్నారు డీఎస్పీ. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ జూలై నుంచి ప్రారంభంకానుందని తెలుస్తోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘ఆటా నాదే వేటా నాదే’ చిత్రంలో వెంకీ నటిస్తుండగా.. సంకల్ప్‌రెడ్డి డైరెక్షన్‌లో వరుణ్ ఓ సినిమా చేస్తున్నారు.

More News

బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రంలో న‌వ‌దీప్‌?

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్‌లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

 ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం -నిర్మాత‌లు

నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ` టి.జి.విశ్వప్రసాద్ సవుర్పణలో

'అభిమన్యుడు' లో 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా'.. పాట విడుదల

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో

అఖిల్‌-వెంకీ అట్లూరి చిత్రం ప్రారంభం

యూత్‌కింగ్‌ అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకం పై తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్‌ హిట్‌ సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.25

'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్

వ‌రుస విజ‌యాల హీరో నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.