'ఎఫ్ 2' చిత్ర కాన్సెప్ట్ అదే...
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ `ఎఫ్2`. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్`ట్యాగ్ లైన్. ఇందులో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారట.
వెంకీ జోడిగా తమన్నా.. వరుణ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఇద్దరూ భార్యలు పెట్టే బాధలు భరించలేక బ్యాంకాక్ వెళతారట. అక్కడ వారికేం పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథాంశం. ఈ కాన్సెప్ట్ వింటుంటే శ్రీకాంత్, సునీల్, వేణు నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమాకు దగ్గరగా ఉంది కదూ! మరి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments