వెంకీ.. ముచ్చటగా మూడోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ కథానాయకుడు వెంకటేష్ గత సంవత్సరం గురు చిత్రంతో సరిపెట్టారు. అయితే ఈ ఏడాది మాత్రం నాలుగైదు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ మధ్య వెంకీనే స్వయంగా ప్రకటించారు. అజ్ఞాతవాసిలోని అతిథి పాత్రతో తొలిగా ఈ ఏడాది సందడి చేయనున్న వెంకీ.. ఆ తరువాత తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రంతో తెరపైకి రానున్నారు. అలాగే అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలోనూ వెంకీ ఓ కథానాయకుడిగా నటించబోతున్నారు.
త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా సంగతి సరేసరి. అంతేకాదు.. తాజాగా మరో చిత్రానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. తొలి సినిమాతో సంచలనం సృష్టించిన ఓ లేడీ డైరెక్టర్ కాంబినేషన్లో వెంకీ ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదివరకు దృశ్యం చిత్రంతో శ్రీప్రియ, గురు చిత్రంతో సుధ కొంగ కాంబినేషన్లో సినిమాలు చేసి విజయాలు అందుకున్న వెంకటేష్.. ముచ్చటగా మూడోసారి దాన్ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com