ఆగ‌స్టులో రానున్న వెంకీ, తేజ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. శ్రియ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. అత‌ని స‌ర‌స‌న ఈషా రెబ్బా న‌టించ‌నుంది. అనూప్ రూబెన్స్ సంగీత‌మందిస్తున్నారు.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఆటా నాదే వేటా నాదే' అనే పేరు ప‌రిశీల‌నలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ఈ నెల 26 నుంచి ప్రారంభించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా.. జూలై నాటికి సినిమాని పూర్తిచేసి ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

వెంక‌టేష్ ఫిజిక్స్ ప్రొఫెస‌ర్‌గా న‌టించ‌నున్న ఈ సినిమాలో నారా రోహిత్ అత‌నికి బావ‌మ‌రిది పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రం పూర్తిచేశాక‌.. 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌పై దృష్టి సారించ‌నున్నారు తేజ‌.

More News

'మ‌హిళా క‌బ‌డ్డి' చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్‌

ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మ‌హిళా క‌బ‌డ్డి'.  ర‌చన స్మిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే మూడ‌వ‌ షెడ్యూల్ షూటింగ్  పూర్తి చేసుకుంది.

మార్చి 23న గులేబకావళి

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్

నేను నా సాహితీ ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసాను-ఎన్నో పురస్కారాలు ,అభినందనలు అందుకున్నాను-కాని ఈ ఎంత సక్కగున్నావే పాటకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం.

'రాజరథం' లో ఆర్య లుక్ కి సుదీప్ ప్రేరణ

'రాజరథం' లో విశ్వ గా ఆర్య ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రావడం, ఆ లుక్ పాత్ర మీద అంచనాలు పెంచింది. ఆ లుక్ వాస్తవానికి ఈగ, బాహుబలి ఫలే కిచ్చ సుదీప్ నుండి ప్రేరణ పొంది రూపొందించినది.

'రాజుగాడు' టీజ‌ర్ అప్‌డేట్‌

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్'.. ఇలా వరుసగా యూత్‌ఫుల్‌ సినిమాలతో యూత్‌కు బాగా దగ్గరైన హీరో రాజ్ తరుణ్.