వెంకటేష్, తేజ సినిమా మరింత ఆలస్యం?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్, సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకి సంబంధించి.. గత డిసెంబర్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాకి ‘ఆటా నాదే వేటా నాదే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియ, ఈషా రెబ్బా కథానాయికలుగా నటించనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. మార్చి నెలలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాల్సిన ఈ సినిమా.. ఇప్పటి వరకు సెట్స్ పైకి మాత్రం వెళ్ళలేదు. చిత్ర నిర్మాత సురేష్ బాబు.. కథ విషయంలో అంత సంతృప్తిగా లేకపోవడమే కారణమని తెలిసింది. కొన్ని మార్పులు చేయమని తేజకి సలహా ఇచ్చారట సురేష్ బాబు. అయితే.. ఎన్టీఆర్ బయోపిక్‌కి కూడా తేజ దర్శకత్వం వహిస్తుండడంతో.. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కొంత జాప్యం జరిగేట్టుగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాతే వెంకటేష్, తేజ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టి-టౌన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈలోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేయాలని వెంకీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ డైరెక్షన్లో ‘ఎఫ్-2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout