వెంకటేష్, తేజ చిత్రం ఆగిపోయిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్, తేజ కాంబినేషన్లో ‘ఆటా నాదే వేటా నాదే’ పేరుతో ఓ సినిమా రూపొందనుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి డిసెంబర్ నెలలోనే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే చాలా వరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకున్న ఈ చిత్రం.. సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోయిందని టీ-టౌన్లో తాజాగా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు.. బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘యన్.టి.ఆర్’ సినిమాకి కూడా తేజ డైరెక్టర్.
అయితే ముందుగా వెంకటేష్ సినిమాని రూపొందించి.. ఆ తర్వాత ‘యన్.టి.ఆర్’ చిత్రంపై ఫోకస్ పెడదామని తేజ భావించారు. కాని బాలకృష్ణ మాత్రం ‘యన్.టి.ఆర్’ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది దసరాకి విడుదల కావాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు చేయడం తేజకి తలకు మించిన భారం కావడంతో వెంకటేష్ ఈ ప్రాజెక్ట్‌ని పక్కన బెట్టేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని పూర్తిగా ఆపేశారా? లేకపోతే వేరే దర్శకుడితో కలిసి పట్టాలెక్కిస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెంకటేష్ చేతిలో రెండు మల్టీస్టారర్ మూవీలు ఉన్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments