కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్న వెంకీ, తేజ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త నటీనటులతో సినిమాలను తెరకెక్కించడం దర్శకుడు తేజకు కెమెరాతో పెట్టిన విద్య. గతంలో ఎన్నో సినిమాలను ఇలా తెరకెక్కించి విజయాలను చవి చూసారీ దర్శకుడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా తేజ రూపొందిస్తున్నఆటా నాదే వేటా నాదే` (ప్రచారంలో ఉన్న పేరు) సినిమాలో కూడా కొన్ని కీలక పాత్రల కోసం కొత్త వారినే ఆయన ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమందిని స్క్రీన్ టెస్ట్ కి పిలవడం...వారితో రిహార్సల్ చేయించడం కూడా జరిగిందట. అందుకే, గత డిసెంబర్లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. చిత్రీకరణ ప్రారంభం కాబోతుందంటూ ఇప్పటికే రెండు, మూడు తేదీలను కూడా మార్చారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఈ నెల 18నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలిసింది. ఇదిలా వుంటే...ఈ సినిమాలో కనిపించే పాత్రలలో దాదాపు 70శాతం కొత్తవారే కావడం విశేషం. కొత్తవారితో సినిమాకి ఫ్రెష్ నెస్ వస్తుందని తేజ అంటున్నా...నిర్మాతకు ఖర్చు మిగల్చడం కోసం కొత్తవారిని తీసుకుంటున్నట్టు కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సురేష్ ప్రొడక్షన్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కథానాయికల వివరాలతో పాటు ఇతర సాంకేతిక వర్గం విషయాలను కూడా త్వరలో వెల్లడించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments