మూడో వారం నుంచి వెంకీ, తేజ చిత్రం?

  • IndiaGlitz, [Sunday,February 04 2018]

చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూసిన సంచ‌ల‌న దర్శకుడు తేజ.. గతేడాది రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తేజ‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు, హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఆ క్రమంలోనే సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గ వైవిధ్యభరితమైన కథను త‌యారు చేసిన తేజ.. ఇటీవ‌లే ఈ సినిమాని ప‌ట్టాలెక్కించారు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి.. ఒక ఆసక్తికరమైన వార్తను చిత్ర యూనిట్ వెల్లడించింది. అదేమిటంటే.. ఈ నెల 3వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంద‌ట‌. దీనికి సంబంధించి ఇప్ప‌టికే సన్నాహాలు కూడా జరుగుతున్నాయని స‌మాచార‌మ్‌. ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమాలో నారా రోహిత్‌ యువ క‌థానాయ‌కుడు ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నార‌ని తెలిసింది.

More News

'యన్.టి.ఆర్' కి నిత్యా నో చెప్పిందా?

మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా 'యన్.టి.ఆర్' పేరుతో సంచలన దర్శకుడు తేజ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

విజయేంద్ర ప్రసాద్ కథతో విష్ణు చిత్రం?

అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి.అతని విజయాల వెనకుండి నడిపిస్తున్న అదృశ్యవ్యక్తి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్.

ఫిబ్రవరి 14న నా పేరు సూర్య రెండో పాట....

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అనుఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం'నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా'.

ఒక్కరితో మొదలై...లక్షలాది సైన్యంగా మనంసైతం..

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ మనం సైతం దిగ్విజయంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

క్లైమాక్స్ పూర్తిచేసుకున్న 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’.