మూడో వారం నుంచి వెంకీ, తేజ చిత్రం?
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూసిన సంచలన దర్శకుడు తేజ.. గతేడాది రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆ క్రమంలోనే సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గ వైవిధ్యభరితమైన కథను తయారు చేసిన తేజ.. ఇటీవలే ఈ సినిమాని పట్టాలెక్కించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి.. ఒక ఆసక్తికరమైన వార్తను చిత్ర యూనిట్ వెల్లడించింది. అదేమిటంటే.. ఈ నెల 3వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు కూడా జరుగుతున్నాయని సమాచారమ్. ఆటా నాదే వేటా నాదే` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో నారా రోహిత్ యువ కథానాయకుడు ఓ కీలక పాత్రను పోషించనున్నారని తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com