వెంకీ... సూపర్ బిజీ!
- IndiaGlitz, [Tuesday,September 25 2018]
హీరో వెంకటేష్ ఇప్పుడు సూపర్ బిజీగా మారారు. తండ్రి రామానాయుడు చనిపోయిన తర్వాత దాదాపు ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా సూపర్ ఫాస్ట్ గా షెడ్యూల్స్ చేస్తున్నారు. వరుణ్‌తేజ్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 చేశారు. ఆ సినిమా పూర్తి కావచ్చింది. దీని తర్వాత మేనల్లుడు నాగచైతన్యతో కలిసి కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామ' చేస్తారు. ఆ సినిమా వెంటనే లైన్లో త్రివిక్రమ్ సినిమా, త్రినాథరావు నక్కిన సినిమాలున్నాయి.
అయితే వీటన్నిటిని షఫిల్ చేస్తూ బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఉంటుందని టాక్. ఈ మధ్య బొమ్మరిల్లు భాస్కర్ వెంకటేష్‌ని కలిసి ఓ లైన్ చెప్పారట. లైన్ వరకు బావుంది కానీ, సన్నివేశాల పరంగా చాలా వర్కవుట్ చేయాలని వెంకటేష్ సూచించినట్టు సమాచారం. ఇన్ని సినిమాల మధ్య ఆయన కుమార్తె పెళ్లి పనులు కూడా చూడాల్సి ఉంది. సో 30 ఏళ్ల కు పైబడిన తర్వాత కూడా కెరీర్ పరంగా వెంకటేష్ దూకుడు ఏమాత్రం తగ్గలేదని ఈ లిస్ట్ చూస్తే అర్థమైపోతుంది.