వెన్నునొప్పితో వెంకీ...
- IndiaGlitz, [Saturday,January 26 2019]
సీనియర్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ వెన్నునొప్పితో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. గత కొన్ని నెలలుగా వెంకటేష్ వెన్నునొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలో అది మరీ ఎక్కువైంది. దాంతో ఆయన్ను నేచుర్ క్యూర్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారట.
ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన 'ఎఫ్2.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 'తో హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తదుపరి బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ' సినిమా చేయబోతున్నాడు. కాస్త ఉపశమనం కాగానే వీలైనంత త్వరగా వెంకీమామ సెట్స్‌కి వెళుందని సమాచారం.