వెంకీ త‌దుప‌రి చిత్రానికి ముహుర్తం ఖ‌రారు

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ - న‌య‌న‌తార జంట‌గా మారుతి తెర‌కెక్కించిన చిత్రం బాబు...బంగారం. ఈ చిత్రం రిలీజైన అన్ని చోట్లా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా మంచి టాక్ తో ప్ర‌ద‌ర్శిత‌మ‌మౌతుంది. ఇదిలా ఉంటే... వెంకీ త‌దుప‌రి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన సాలా ఖాదూస్ చిత్రం రీమేక్ లో వెంకీ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు రీమేక్ కి కూడా సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సాలా ఖాదూస్ లో మాధ‌వ‌న్ చేసిన బాక్సింగ్ కోచ్ క్యారెక్ట‌ర్ ను వెంక‌టేష్ చేస్తున్నారు. ఇక ఓరిజిన‌ల్ వెర్షెన్ లో న‌టించిన రితికా సింగ్ రీమేక్ లో కూడా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 7న ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత వెంక‌టేష్ నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రం చేయ‌నున్నారు.

More News

విశాల్‌, తమన్నా జంటగా జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ఒక్కడొచ్చాడు

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రానికి ఒక్కడొచ్చాడు టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రం కోసం ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో భారీ ఎత్తున కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని చిత్రీకరించారు.

ఆలోచింప చేస్తున్న గ్యారేజ్ డైలాగ్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న న‌వీన్‌చంద్ర చిత్రం

అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న పూర్త&

ల‌క్ష్మి బాంబ్ కోసం మంచు మ‌నోజ్ ఫైట్స్

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌

'జ‌న‌తాగ్యారేజ్'ఆల‌స్యం అవుతుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ రూపొందుతోన్న చిత్రం ‘జ‌న‌తాగ్యారేజ్’. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న మూడో చిత్ర‌మిది.