రిలేషన్ గురించి వెంకటేశ్ పోస్ట్.. సమంతా- నాగచైతన్య గురించేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన ఘటనను తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరు కలిసి నటించిన సినిమా, వాణిజ్య ప్రకటన చూసినప్పుడల్లా.. అలా జరగకుండా వుంటే ఎంత బాగుండు అని ఫీలవుతూనే వున్నారు. రోజులు గడుస్తున్నా చైసామ్ విడాకుల వ్యవహారంపై ఇంకా డిస్కషన్ నడుస్తూనే వుంది. అంతేకాకుండా వీరి గురించి వచ్చే వార్తలకు అటెన్షన్ కూడా అలాగే వుంటుంది. సామాన్య ప్రజలకు ఇలా వుంటే మరి వీరి కుటుంబాలకు, సన్నిహితులకు ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ విషయం పక్కనబెడితే.. నాగచైతన్య మేనమామ , టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ గత కొన్ని రోజులుగా పెడుతున్న కోట్స్ చూస్తుంటే నాగచైతన్య- సమంతల వ్యవహారంగా ఆయన బాగా డిస్ట్రబ్ అయినట్లుగా కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక లైఫ్ లెసన్ను ఆయన షేర్ చేస్తూనే వున్నారు. తాజాగా వెంకటేశ్ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్ యూస్ చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా విశ్వసిస్తారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయవద్దు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోవద్దు' అంటూ వెంకటేశ్ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ఈ కొటేషన్స్ పరోక్షంగా చైసామ్ గురించేనా అంటూ అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com