మెగా హీరోల‌తో వెంకీ సెంటిమెంట్‌

  • IndiaGlitz, [Thursday,June 21 2018]

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌లా నిలుస్తున్న సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌సాలా, గోపాల గోపాల‌.. చిత్రాల‌ను ఈ జాబితాలోనే చేర్చుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఆయన రెండు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ చేస్తున్నారు.

అవే.. వ‌రుణ్ తేజ్‌తో చేస్తున్న ఎఫ్ 2, నాగ‌చైత‌న్య‌తో చేస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం. వీటిలో ఎఫ్ 2ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. వ‌రుణ్ తేజ్ బాబాయ్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి వెంకీ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ గోపాల గోపాల (2015) కూడా సంక్రాంతికే విడుద‌లైంది. మ‌ళ్ళీ నాలుగేళ్ళ త‌రువాత అదే సంక్రాంతికి వ‌రుణ్‌తో క‌లిసి ఎఫ్ 2తో సంద‌డి చేయ‌బోతున్నారు వెంకీ.