రియ‌ల్ హీరోస్‌కు సెల్యూట్ : వెంక‌టేశ్‌

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

క‌రోనా మ‌హ‌మ్మారి నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో డాక్ట‌ర్లు, పోలీసులు, ఇత‌ర ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అహ‌ర్నిశ‌లు ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. డాక్ట‌ర్లు హాస్పిట‌ల్స్‌లో ఉండి సాయ‌ప‌డుతుంటే.. పోలీసులు విధి నిర్వ‌హ‌ణ‌లో ఉంటున్నారు. వీరి గొప్పత‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స‌హా నాగ‌చైత‌న్య పోలీసుల‌ను అప్రిషియ‌ట్ చేశారు. ఇప్పుడు విక్ట‌రీ వెంక‌టేశ్‌, క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా పోలీసుల ఔన‌త్యాన్ని అభినందించారు.

‘‘ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఓ ర‌క్ష‌ణ క‌వచంలా ఉండి ప్ర‌జ‌లు, కుటుంబాల‌ను కాపాడుతున్న డాక్ట‌ర్లు, పోలీసుల‌కు హృద‌య‌పూర్వక అభినంద‌న‌లు. వీరు అతి పెద్ద యుద్ధం చేస్తున్నారు. మీరే నిజ‌మైన హీరోలు. మీకు సెల్యూట్’’ అంటూ వెంకటేశ్ డాక్లర్లను, పోలీసులను అభినందించారు. డాక్లర్లు, పోలీసులు 24 గంటలు కష్టపడుతున్నారని, అసలు ఈ లాక్‌డౌన్ పోలీసులు, ప్ర‌భుత్వం వ‌ల్లే స‌క్సెస్ అయ్యిందని విజ‌య్ దేవ‌ర‌కొండ తెలిపారు. టైమ్ పాస్ కోసం లాక్‌డౌన్ బ్రేక్ చేయ‌వ‌ద్దంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

More News

అల్లు ఫ్యామిలీ, పవన్‌తో విబేధాలపై చిరు క్లారిటీ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తుంటాయ్.

త్రిష ఒకలా.. మెగాస్టార్ మరోలా.. అసలేం జరిగింది!?

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఈ పాటికే సుమారు సగానికి పైగా సినిమా పూర్తయ్యేది.

తెలంగాణలో అందరూ మాస్క్‌లు వాడాల్సిందే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు మాస్క్‌లు ధరించడాన్ని

సూపర్ మార్కెట్‌లోకి నో ఎంట్రీ.. రాచకొండ సీపీ వార్నింగ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు అతి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అదనుగా

కరోనాపై పోరు: అగ్రరాజ్యం కంటే ఇండియా చాలా బెటర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.