Saindhav:'ఈసారి లెక్క మారుద్ది' అంటున్న వెంకీ మామ.. యాక్షన్ థ్రిల్లర్‌గా 'సైంధవ్' టీజర్‌..

  • IndiaGlitz, [Monday,October 16 2023]

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'సైంధవ్'. వెంకీ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో వెంకటేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ చూస్తుంటే వెంకీ మామ వైల్డ్ పాత్రలో ఇరగదీశాడు. వెళ్లే ముందే చెప్పి వెళ్లాను వినలేదు.. అంటే భయం లేదు ఈసారి లెక్క మారుద్ది అంటూ విలన్స్‌కు వెంకీ వార్నింగ్ ఇస్తున్న సీన్ సినిమాపై హైప్స్ పెంచేసింది.

వెంకీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరెకెక్కుతున్న మూవీ..

భార్య, కూతురితో సంతోషంగా జీవించే హీరో.. విలన్స్‌ ఆగడాలను ఎలా అడ్డుకోనున్నట్లు టీజర్‌లో చూపించారు. ఇందులో విలన్‌గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించాడు. సైకో విలన్‌గా తన లక్ష్యం కోసం ఘోరంగా చంపేసే పాత్రలో జీవించాడు. ఇక దాదాపు 20వేల మంది పిల్లలకు గన్స్ వినియోగంలో శిక్షణ ఇచ్చి సంఘ విద్రోహ శక్తులుగా వారిని తీర్చిదిద్దడం చూస్తుంటే ఈ సినిమాను ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తీసినట్లు అర్థమవుతోంది. వెంకీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం.

అతిథి పాత్రలో తమిళ స్టార్ హీరో 'ఆర్య'.

'హిట్', 'హిట్ 2' వంటి థ్రిల్లర్ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న డాక్టర్.శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కూడా తనదైన శైలిలో క్రైమ్ థ్రిల్లర్‌గా తీసినట్లు టీజర్‌లో చూపించారు. ఈ మూవీలో వెంకటేష్‌కి జోడిగా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, జయప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ హీరో ఆర్య కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఫిల్మ్‌ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.