నెక్ట్స్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన వెంకటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకటేష్ - నయనతార జంటగా నటించిన చిత్రం బాబు బంగారం. మారుతి తెరకెక్కించిన బాబు..బంగారం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే....విక్టరీ వెంకటేష్ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ ను వెంకటేష్ ఈరోజు ఎనౌన్స్ చేసారు.
బాబు..బంగారం ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ....కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకి టైటిల్ ఆడవాళ్లు మీకు జోహార్లు అని ఎనౌన్స్ చేసారు. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో పి.ఆర్.సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత పూస్కూర్ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ సరసన నటించే కథానాయిక తో పాటు చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com