వెంకటేశ్ - రానా మల్టీస్టారర్ డైరెక్టర్ ఫిక్స్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
దగ్గుబాటి హీరోలైన విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి ఓ సినిమా ఎప్పుడు చేస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయలేదా? అంటే చేశారు. కృష్ణంవందే జగద్గురుమ్ సినిమాలో ఓ పాటలో రానాతో వెంకీ స్టెప్పులేశాడు. అలాగే బుల్లితెరపై రానా హోస్ట్ చేసిన నెంబర్ వన్ యారీ ప్రోగ్రామ్‌లోనూ వెంకటేశ్ పాల్గొన్నాడు. అయితే వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది అనౌన్స్ అయ్యే అవకాశాలున్నాయని రానా దగ్గుబాటి తెలియజేసిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ సమాచారం మేరకు నిర్మాత సురేష్‌బాబు.. దగ్గుబాటి ఫ్యామిలీ మల్టీస్టారర్ కోసం సన్నాహాలు చేస్తున్నారట. శతమానం భవతి సినిమా వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడట. సురేష్‌బాబుకి కథ నచ్చితే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయట. అయితే లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు వీరిద్దరూ సినిమా కంటే ముందుగానే ఓ రియాలిటీ షో ద్వారా సందడి చేయబోతున్నారట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com