వెంకీ మ‌రో ముంద‌డుగు..

  • IndiaGlitz, [Monday,September 03 2018]

ఆద‌ర్శాల గురించి మాట్లాడ‌టం వేరు. వాస్త‌వాల‌ను అర్థం చేసుకుని ముంద‌డుగు వేయ‌డం వేరు. ఈ రెండో విష‌యంలో ఎప్పుడూ ముందుంటారు విక్ట‌రీ వెంక‌టేష్‌. కొత్త విష‌యాల‌ను ప్రోత్స‌హించ‌డానికి, నిజాన్ని గ్రహించ‌డానికి ఆయ‌నెప్పుడూ వెన‌క‌డుగేయ‌రు.

మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఈ త‌రంలో మ‌ర‌లా శ్రీకారం చుట్టింది కూడా ఆయ‌నే. 'సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' సినిమాతో ఆయ‌న మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్‌కు తెర‌లేపారు. అలాగే రామ్‌తో 'మ‌సాలా' చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో 'గోపాలా గోపాలా' చేశారు. ఇప్పుడు మ‌ర‌లా మల్టీ స్టార‌ర్ ట్రెండ్‌లో ఉన్నారు.

వ‌రుణ్‌తేజ్‌తో ఎఫ్‌2లో న‌టిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి చేయాల్సిన సినిమా వాయిదా ప‌డింది. ఇవ‌న్నీ ఇక‌వైపు ఉండ‌గా.. దుల్క‌ర్‌తో చేయ‌డానికి అంగీక‌రించారు. ఎప్ప‌టి నుంచో టాక్స్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ తాజాగా ఫైన‌ల్ అయిపోయింద‌ని స‌మాచారం. దుల్క‌ర్ సల్మాన్ 'ఓకే బంగారం' 'మ‌హాన‌టి' చిత్రాల‌తో తెలుగువారికి సుప‌రిచితుడే. ఈయ‌న ప్ర‌ముఖ మ‌ల‌యాళం హీరో మ‌మ్ముట్టి త‌న‌యుడు. మ‌మ్ముట్టి ప్ర‌స్తుతం వైయ‌స్సార్ బ‌యోపిక్ 'యాత్ర‌'లో న‌టిస్తున్నారు. సో అటు తండ్రి, ఇటు త‌న‌యుడూ ఇద్ద‌రూ తెలుగులో మంచి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నార‌న్న‌మాట‌.