వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ డీటైల్స్..

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన తాజా చిత్రం బాబు..బంగారం. యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన బాబు...బంగారం చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. బాబు బంగారం ఆడియో ఈనెల 24న‌, చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంక‌టేష్ త‌దుప‌రి చిత్రాన్ని నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల తో చేయ‌నున్నారు. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ కిషోర్ వెంకీకి క‌థ చెప్ప‌డం...క‌థ విని వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని మ‌ల్టీ డైమ‌న్ష‌న్ సంస్థ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన అఖిల్..

నాగ చైతన్య,సమంత లవ్ లో ఉన్నారని ఓ పక్క ప్రచారం జరుగుతుంటే...ఎవరూ ఊహించని విధంగా అఖిల్ నేను ప్రేమలో పడ్డాను అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.

25 కోట్ల 'బిచ్చగాడు'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని,సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’

ముందుకొచ్చిన 'మనమంతా'

జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్.విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'మనమంతా'.

అంప‌శ‌య్య న‌వ‌ల‌కు వెండితెర పై మంచి న్యాయ‌మే జ‌రిగింది - ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు

‘అంపశయ్య’ నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ 1969లో రాసిన ఈ నవల ఆయన ఇంటి పేరైపోయింది.

శ్రీరస్తు-శుభమస్తు విడుదల తేదీ ఖరారు..

అల్లు శిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.