వెంకీ న్యూ మూవీ టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్..యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈనెలలోనే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన అందాల తార నయనతార నటించనుంది.. గతంలో వెంకీ - నయన్ కాంబినేషన్లో రూపొందిన లక్ష్మీ, తులసి చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో..తెలిసిందే. మళ్లీ ఇప్పుడు వెంకీ, నయన్ కలసి సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రారంభం నుంచే ఆసక్తి మరెంత పెరిగింది. ఇక అసలు విషయానికి వస్తే..వెంకీ -నయన్ ల ఈ క్రేజీ మూవీకి నాలుగు టైటిల్స్ పరిశీలించారు. ఫైనల్ గా బాబు బంగారం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments