వెంకీ న్యూ మూవీ టైటిల్

  • IndiaGlitz, [Monday,December 07 2015]

విక్ట‌రీ వెంక‌టేష్..యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈనెల‌లోనే ప్రారంభించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న అందాల తార న‌య‌న‌తార న‌టించ‌నుంది.. గ‌తంలో వెంకీ - న‌య‌న్ కాంబినేష‌న్లో రూపొందిన ల‌క్ష్మీ, తుల‌సి చిత్రాలు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాయో..తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు వెంకీ, న‌య‌న్ క‌ల‌సి సినిమా చేస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రారంభం నుంచే ఆస‌క్తి మ‌రెంత పెరిగింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..వెంకీ -న‌య‌న్ ల ఈ క్రేజీ మూవీకి నాలుగు టైటిల్స్ ప‌రిశీలించారు. ఫైన‌ల్ గా బాబు బంగారం అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు సమాచారం.

More News

'బాహుబలి 3' స్టార్టయిందట....

తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్ళిన సినిమా ‘బాహుబలి’. రెండు పార్టులున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ బాహుబలి బిగినింగ్ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 చిత్రీకరణను రంగం సిద్ధమవుతుంది.

చిరు150వ సినిమాకి కొత్త ముహుర్తం...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే..ఉన్నాయి.దసరా కి 150వ సినిమా గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని స్వయంగా చిరంజీవి ప్రకటించారు.

ఈ నెల18 విడుదలకు సిద్ధమవుతున్న'కిల్లింగ్ వీరప్పన్'

తమిళనాడు,కర్ణాటక,కేరళ రాష్ట్రాలను గడ గడలాడిరచిన గంధపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం 'కిల్లింగ్ వీరప్పన్'.

మూడురోజుల్లో పది కోట్ల గ్రాస్ వచ్చింది - కోనవెంకట్

ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి ముహుర్తం ఖరారు

యంగ్ టైగర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో... సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు.