వెంకీ న్యూమూవీ డీటైల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్..ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు..బంగారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. వెంకీ సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే...వెంకటేష్ హీరోగా నల్లమలపు బుజ్జి ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. వెంకీ తో బుజ్జి నిర్మించే ఈ చిత్రాన్ని ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com