వెంకీ న్యూమూవీ ఫిక్స్..

  • IndiaGlitz, [Monday,January 11 2016]

విక్ట‌రీ వెంక‌టేష్‌..మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబు..బంగారం సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..వెంక‌టేష్ మ‌రో మూవీ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. మ‌ల‌యాళంలో జీతు జోస‌ఫ్ తెర‌కెక్కించిన దృశ్యం చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే.

ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీప్రియ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ అదే టైటిల్ తో దృశ్యం సినిమా చేసారు. ఇప్పుడు మ‌ల‌యాళ దృశ్యం డైరెక్ట‌ర్ జీతు జోస‌ఫ్ డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌డానికి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. జీతు చెప్పిన క‌థ‌, క‌థ‌నం న‌చ్చి వెంకీ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్నారు.