'నారప్ప' ట్రైలర్: వెంకటేష్ మాస్ విశ్వరూపం
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత వెంకీ రఫ్ లుక్ లో మాస్ పెర్ఫామెన్స్ అందించబోతున్న చిత్రం ఇది. దీనితో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో ఘనవిజయం అందుకున్న ధనుష్ 'అసురన్' చిత్రానికి రీమేక్ ఇది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు. సున్నితమైన భావోద్వేగాలతో సినిమాలు తెరకెక్కిచి శ్రీకాంత్.. అసురన్ లాంటి రా కంటెంట్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే అనుమానాలు ఉండేవి. తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. వెంకటేష్ ని మాస్ అవతార్ లో శ్రీకాంత్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది.
చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ రోల్ దొరకడంతో వెంకీ చెలరేగిపోయినట్లే కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని రెట్టింపు చేసే విధంగా ఉంది. వెంకటేష్ గతంలో కూడా మాస్ చిత్రాలు చేశారు. కానీ నారప్ప చిత్రం అటు వెంకీతో పాటు అభిమానులకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి.
'యాడికి పోయినా పదిమంది తక్కువ లేకుండా పోయేది.. బండ్లకు తుపాకీ వెంటేసుకు పోయేది.. ఎట్టయ్య సూత్తా ఊరుకున్నారు'అంటూ పోలీస్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వెంకటేష్ పచ్చ కండువా తలపాగా సిగ్నేచర్ స్టైల్ లో కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్ లో కూడా మరో లుక్ లో వెంకటేష్ పాత్ర ఉంది.
మాటువేసి వెంటాడే పులిలా వెంకటేష్ క్యారక్టరైజేషన్ ని దర్శకుడు రూపొందించారు. 'వాళ్ళని ఎదిరించడానికి అదొక్కటే దారి కాదు.. మనదగ్గర భూమి ఉంటె తీసేసుకుంటారు.. డబ్బుంటే లాగేసుకుంటారు.. కానీ చదువునొక్కటి మాత్రం మనదగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప' అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ చాలా బావుంది.
యాక్షన్ సన్నివేశాల్లో మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ప్రియమణి విలేజ్ మహిళగా ఆకట్టుకుంటోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 20న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com