షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నారప్ప’
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నారప్ప’. సురేష్ ప్రొడఓన్స్ , వి క్రియేషన్స్ పతాకాలపై కలైపులి థాను, డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, స్టార్ట్ అయిన ‘నారప్ప’ షూటింగ్ సోమవారంతో పూర్తయ్యింది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేసింది. టి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన `నారప్ప` టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
తమిళ చిత్రం అసురన్‌కు ఇది రీమేక్. ధనుశ్ చేసిన పాత్రను వెంకటేశ్ చేస్తున్నారు. తెలుగులో మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments