కలిసొచ్చిన కథానాయికలతో వెంకీ, చైతన్య?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాకి కథ ఎంత ముఖ్యమో, నటీనటుల ఎంపిక కూడా అంతే ముఖ్యం. నటీనటుల ఎంపికపైనే సగం విజయం ఆధారపడి ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు.. సక్సెస్ఫుల్ కాంబినేషన్లతోనే సినిమాలను తెరకెక్కించేందుకు ఆసక్తిచూపుతారు. ఇప్పుడు అలాంటి విజయవంతమైన జంటలను ఓ మల్టీస్టారర్ మూవీ కోసం ఎంపిక చేశారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా బాబీ డైరెక్షన్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోయే ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార, చైతూ సరసన సమంతను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వెంకీ, నయన్ కలిసి నటించిన ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించాయి.
'బాబు బంగారం' తరువాత వీరిద్దరు కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక నాగచైతన్య, సమంత విషయానికి వస్తే.. 'ఏమాయ చేసావె', 'మనం' వంటి హిట్ చిత్రాల్లో సందడి చేశారు. ఆ తరువాత 'ఆటోనగర్ సూర్య' విడుదలైంది. ప్రస్తుతం శివ నిర్వాణ సినిమా చేస్తున్నారు. త్వరలోనే కథానాయికల ఎంపికపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments