క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల‌తో వెంకీ, చైత‌న్య‌?

  • IndiaGlitz, [Monday,March 26 2018]

సినిమాకి కథ ఎంత ముఖ్యమో, నటీనటుల ఎంపిక కూడా అంతే ముఖ్యం. నటీనటుల ఎంపికపైనే సగం విజయం ఆధారపడి ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు.. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌ల‌తోనే సినిమాలను తెరకెక్కించేందుకు ఆసక్తిచూపుతారు. ఇప్పుడు అలాంటి విజయవంతమైన జంటలను ఓ మల్టీస్టారర్ మూవీ కోసం ఎంపిక చేశార‌ని స‌మాచారం.

ఆ వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా బాబీ డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోయే ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార, చైతూ సరసన సమంతను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వెంకీ, నయన్ కలిసి నటించిన ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించాయి.

'బాబు బంగారం' త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి న‌టించే సినిమా ఇదే అవుతుంది.  ఇక నాగ‌చైత‌న్య‌, స‌మంత విష‌యానికి వ‌స్తే.. 'ఏమాయ చేసావె', 'మ‌నం' వంటి హిట్ చిత్రాల్లో సంద‌డి చేశారు. ఆ త‌రువాత 'ఆటోన‌గ‌ర్ సూర్య' విడుద‌లైంది. ప్ర‌స్తుతం శివ నిర్వాణ సినిమా చేస్తున్నారు. త్వ‌ర‌లోనే క‌థానాయిక‌ల ఎంపిక‌పై క్లారిటీ వ‌స్తుంది.

More News

ఏప్రిల్ 18 నుంచి రాజ్ త‌రుణ్ కొత్త చిత్రం

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్.

మే నెల‌లో మారుతి, చైత‌న్య మూవీ ఫ‌స్ట్‌లుక్‌

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు).

ఆది, అడివి సాయికిరణ్ సినిమా అప్‌డేట్‌

'ప్రేమకావాలి', 'లవ్లీ' సినిమాలతో వ‌రుస విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. గత కొంత కాలంగా విజయాలకు దూరమైన ఈ యంగ్ హీరో..

చిరు సినిమా పై స్పందించిన సుకుమార్‌

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ గ‌త కొంత కాలంగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

విశాఖపట్నంలో వైభవంగా 'కిరాక్ పార్టీ' సక్సెస్ సెలబ్రేషన్స్ !!

నిఖిల్, సిమ్రాన్, సంయుక్త హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.