భారీ బడ్జెట్ ఎంటర్టైనర్గా వెంకీ, చైతు మల్టీస్టారర్ మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు నాగ చైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాని సురేష్ బాబు, కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా.. ఈ సినిమాని భారీ బడ్జెట్ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నట్టు నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు అధికారికంగా వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'వెంకీ మామా' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. స్వతహాగా మామా అల్లుళ్ళైన వెంకీ, చైతు నటిస్తున్న ఈ సినిమాకి 'వెంకీ మామా' టైటిల్ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments