గ్రామీణ నేపథ్యంలో వెంకీ, చైతు సినిమా?

  • IndiaGlitz, [Monday,June 04 2018]

విక్టరీ వెంకటేష్, యువ క‌థానాయ‌కుడు నాగ చైతన్య కథానాయకులుగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ నటిస్తుండగా.. వెంకీకి జోడిగా హ్యూమా ఖురేషి పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘వెంకీ మామా’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

నిజజీవితంలో మామా అల్లుళ్ళైన వెంకీ, చైతు న‌టిస్తున్న చిత్రం కావ‌డం, పాత్ర‌లు కూడా మామా అల్లుళ్ళే కావ‌డంతో.. ఈ సినిమాకి ‘వెంకీ మామా’ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే.. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం తమిళనాడులోని కారైకూడి గ్రామాన్ని సెట్‌గా వేస్తున్నట్టు తెలుస్తోంది. వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. కాగా.. ఈ మల్టీస్టారర్ మూవీని సురేష్ బాబు, కోన వెంకట్‌తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది.