మే నుంచి వెంకీ మల్టీస్టారర్?
Send us your feedback to audioarticles@vaarta.com
మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా తెరను పంచుకున్నారు వెంకీ. ఇప్పుడు మరో యంగ్ హీరోతో ఆయన కలిసి నటించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్2`(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)లో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి వెంకీ సందడి చేయనున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా హాస్యప్రధానంగా సాగే ఈ చిత్రం మే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుందని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇంకా కథానాయికలు ఎంపిక కాని ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం వెంకటేష్..తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే` (ప్రచారంలో ఉన్న పేరు)మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళనున్న ఈ సినిమాని నాలుగు నెలల్లో పూర్తిచేయడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments