మే నుంచి వెంకీ మల్టీస్టారర్?

  • IndiaGlitz, [Saturday,February 03 2018]

మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సీనియ‌ర్‌ కథానాయకుడు విక్టరీ వెంకటేష్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా తెరను పంచుకున్నారు వెంకీ. ఇప్పుడు మరో యంగ్ హీరోతో ఆయ‌న కలిసి నటించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్క‌నున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్2'(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)లో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి వెంకీ సందడి చేయనున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

పూర్తిగా హాస్యప్రధానంగా సాగే ఈ చిత్రం మే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుందని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇంకా క‌థానాయిక‌లు ఎంపిక కాని ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం వెంకటేష్..తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే' (ప్రచారంలో ఉన్న పేరు)మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ళ‌నున్న ఈ సినిమాని నాలుగు నెల‌ల్లో పూర్తిచేయ‌డానికి తేజ స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

మణిరత్నం సినిమాలో మరోసారి..

అదితి రావు హైదరీ..హిందీ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.

శర్వానంద్ తో 'హలో' భామ

గతేడాది విడుదలైన శతమానం భవతి,మహానుభావుడు చిత్రాలు ఇచ్చిన ఫలితాలతో మంచి ఉత్సాహంతో ఉన్నారు

చరణ్ కోసం కసరత్తులు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మహిళలతో సినిమా చూడనున్న 'భాగమతి'

క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం

'హ్యాపీ వెడ్డింగ్' షూటింగ్ పూర్తి

ఇటీవలే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్కతో భాగమతి లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ని సాధించిన యువి క్రియేషన్స్