వెంకీ చిత్రం కాస్త ఆలస్యంగా..
Send us your feedback to audioarticles@vaarta.com
గురు చిత్రం తరువాత వెంకటేష్ కథానాయకుడిగా మరో చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఆయన హీరోగా నటించే తదుపరి చిత్రం.. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్.. వాస్తవానికి ఈ నెల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యంగా.. వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతోందని తెలిసింది. ఈ చిత్రంలో వెంకీ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.
ఇందులో ఆయనది ఇద్దరు పిల్లలకి తండ్రి అయిన ఏజ్డ్ ప్రొఫెసర్ పాత్ర. వెంకీ గత చిత్రాల కంటే భిన్నంగా ఈ పాత్ర, సినిమా ఉంటుందని తెలిసింది. ఇంకా కథానాయిక ఎంపిక కాని ఈ చిత్రం కోసం కాజల్, అనుష్క, అదితి రావ్ హైదరీ వంటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments