వెంకీ సినిమాకు ముహుర్తం కుదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
`బాబుబంగారం` తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ `సాలా ఖద్దూస్` సినిమా రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. సీనియర్ బాక్సర్, జూనియర్ లేడీ బాక్సర్ కు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు అనే కాన్సెప్ట్‌తో నడిచే ఈ సినిమాలో లేడీ బాక్సర్‌గా బాలీవుడ్‌లో నటించిన రితిక సింగ్, తెలుగులో కూడా నటిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 19 న వైజాగ్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.
వైజాగ్‌తో పాటు చెన్నై, మైసూర్ తదితర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనపడటానికి వెంకీ కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాకు `గురు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments