వెంకీ న్యూమూవీ డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల తర్వాత ఏ సినిమా చేయలేదు. చాలా కథలు విన్నప్పటికీ ఏది పూర్తి స్ధాయిలో సంత్రుప్తి కలిగించలేదు. ఆఖరికి యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి చెప్పిన కథ వెంకీకి బాగా నచ్చింది. దీంతో మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మాత రాథా క్రిష్ణ, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
వెంకీని సరికొత్తగా చూపించేలా మారుతి కథని సిద్ధం చేసారు. డిసెంబర్ 16న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. గతంలో వెంకీ, మారుతి కలసి సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఎట్టకేలకు అన్ని కుదిరాయి. ఈ చిత్రానికి రాధా క్రిష్ణ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరి..సీనియర్ హీరో వెంకటేష్ ని యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి ఎలా చూపిస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com