వెంకీ ఆ రెండూ మిస్సవుతున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
'దృశ్యం', 'గోపాల గోపాల' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఆ తరువాత హ్యాట్రిక్ మూవీ విషయంలో చాలా టైమ్‌నే తీసుకున్నాడు. అయితే ఫైనల్‌గా దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ననయనతార హీరోయిన్గా ఎంపికైదన్నది వినిపిస్తున్న వార్తల సారాంశం.
ఇదిలా ఉంటే.. వెంకటేష్ గత రెండు చిత్రాల్లో ఉన్నవి.. రాబోయే కొత్త చిత్రంలో మిస్సయ్యే అవకాశముందని వినిపిస్తోంది. అవేమిటంటే.. 'దృశ్యం', 'గోపాల గోపాల' చిత్రాలు రెండూ రీమేక్‌లు కావడం ఒక అంశమైతే.. ఆ రెండు చిత్రాల్లోనూ పిల్లలకు తండ్రిగా వెంకీ కనిపించడం మరో అంశం. మారుతి సినిమాలో అవి రెండూ మిస్సయ్యే అవకాశముందని వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments