'ఆట గదరా శివ' సాంగ్ రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
'పవర్', 'లింగా', 'బజరంగీ భాయీజాన్' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'ఆటగదరా శివ'. రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. 'ఆ నలుగురు', 'మధు మాసం', 'అందరి బంధువయ'తో ప్రేక్షకుల భావోద్వేగాలను స్పృశించిన సెన్సిటివ్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉదయ్ శంకర్ కథానాయకుడు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రామ రామ రే.. సాంగ్‌ను నేడు(జూన్ 28న) విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా.. విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ - "మంచి ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాలను డైరెక్ట్ చేసే దర్శకుడు చంద్రసిద్ధార్థగారు దర్శకత్వంలో వస్తోన్న 'ఆటగదరా శివ' మంచి సక్సెస్ కావాలని, అలాగే నిర్మాతకు మంచి ప్రాఫిట్స్ రావాలని అశిస్తున్నాను. రామ రామ రే.. సాంగ్ ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు" అని తెలిపారు.
చిత్ర దర్శకుడు చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ "ఉరి తీసే వ్యక్తి.. ఉరి శిక్షకు గురైన మరో వ్యక్తి కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేదే 'ఆటగదరా శివ' చిత్రం. ఆధ్యాత్మికతను, తాత్విక అంశాలను స్పృశించే కథాంశమిది. కన్నడంలో విజయవంతమైన రామ రామరే.. చిత్రాన్ని ఆధారంగా చేసుకుని మన నెటివిటీకి తగిన విధంగా తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులను రంజింపజేసే సినిమా అవుతుంది. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం" అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments