'ఆట గ‌దరా శివ' సాంగ్ రిలీజ్ చేసిన విక్ట‌రీ వెంక‌టేశ్‌

  • IndiaGlitz, [Thursday,June 28 2018]

'ప‌వ‌ర్‌', 'లింగా', 'బ‌జ‌రంగీ భాయీజాన్‌' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'ఆట‌గ‌ద‌రా శివ‌'. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు. 'ఆ న‌లుగురు', 'మ‌ధు మాసం', 'అంద‌రి బంధువ‌య‌'తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో రామ రామ రే.. సాంగ్‌ను నేడు(జూన్ 28న‌) విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా.. విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ - మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాల‌ను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ‌గారు ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న 'ఆట‌గ‌దరా శివ‌' మంచి స‌క్సెస్ కావాల‌ని, అలాగే నిర్మాత‌కు మంచి ప్రాఫిట్స్ రావాల‌ని అశిస్తున్నాను. రామ రామ రే.. సాంగ్‌ ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు అని తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ మాట్లాడుతూ ఉరి తీసే వ్య‌క్తి.. ఉరి శిక్ష‌కు గురైన మ‌రో వ్య‌క్తి క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌నేదే 'ఆట‌గ‌దరా శివ‌' చిత్రం. ఆధ్యాత్మిక‌త‌ను, తాత్విక అంశాల‌ను స్పృశించే క‌థాంశమిది. క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన రామ రామ‌రే.. చిత్రాన్ని ఆధారంగా చేసుకుని మన నెటివిటీకి త‌గిన విధంగా తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. కొత్త‌ద‌నాన్ని కోరుకునే ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసే సినిమా అవుతుంది. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నాం అని చెప్పారు.

More News

వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్‌గా పూజా హెగ్డే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

'ఈ న‌గ‌రానికి ఏమైంది?' వ్య‌వ‌ధి ఎంతంటే..

తొలి చిత్రం 'పెళ్ళి చూపులు' తో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా.. అనేక అవార్డుల‌ను కూడా అందుకున్నారు యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్.

నాగ‌చైత‌న్య కాదు.. సుమంత్‌

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న '@నర్తన శాల'

'ఛలో' ఘ‌న‌విజయం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్మాణ సంస్థ‌లో చేసిన ఈ చిత్రం భారీ లాభాల‌నే మూట‌గ‌ట్టుకుంది.

చివ‌రి షెడ్యూల్ లో 'ఆయుష్మాన్ భవ' న‌వంబ‌ర్ 9న విడుద‌ల‌

నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌.