వెంకీ - క్రిష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Monday,January 16 2017]

గ‌మ్యం, వేదం, కృష్ణం వందేజ‌గ‌ద్గురుమ్, కంచె, తాజాగా బాల‌య్య 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని తెర‌కెక్కించిన విభిన్న క‌థా చిత్రాల‌ ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్. ఈ చిత్రానికి అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే....క్రిష్ త‌దుప‌రి చిత్రాన్ని విక్ట‌రీ వెంక‌టేష్ తో చేయ‌నున్నారు. ఇటీవ‌ల వెంకీకి క్రిష్ క‌థ చెప్ప‌డం...క‌థ విని వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింది.

ఈ ప్రాజెక్ట్ గురించి క్రిష్ ని అడిగితే...ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. వెంక‌టేష్ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తైన త‌ర్వాత నా సినిమా ఉంటుంది. ఈ సినిమా వెంక‌టేష్ 75వ సినిమా అని తెలియ‌చేసారు. క్రిష్ వెంకీతో సోషియో ఫాంట‌సీ మూవీ తీయ‌నున్నార‌ని స‌మాచారం.

మ‌రి...వెంకీని వెరైటీగా క్రిష్ ఎలా చూపించ‌నున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!