వెంకీ - క్రిష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Monday,January 16 2017]

గ‌మ్యం, వేదం, కృష్ణం వందేజ‌గ‌ద్గురుమ్, కంచె, తాజాగా బాల‌య్య 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని తెర‌కెక్కించిన విభిన్న క‌థా చిత్రాల‌ ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్. ఈ చిత్రానికి అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే....క్రిష్ త‌దుప‌రి చిత్రాన్ని విక్ట‌రీ వెంక‌టేష్ తో చేయ‌నున్నారు. ఇటీవ‌ల వెంకీకి క్రిష్ క‌థ చెప్ప‌డం...క‌థ విని వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింది.

ఈ ప్రాజెక్ట్ గురించి క్రిష్ ని అడిగితే...ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. వెంక‌టేష్ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తైన త‌ర్వాత నా సినిమా ఉంటుంది. ఈ సినిమా వెంక‌టేష్ 75వ సినిమా అని తెలియ‌చేసారు. క్రిష్ వెంకీతో సోషియో ఫాంట‌సీ మూవీ తీయ‌నున్నార‌ని స‌మాచారం.

మ‌రి...వెంకీని వెరైటీగా క్రిష్ ఎలా చూపించ‌నున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!

More News

'నాన్న కూచి' అంటున్న నిహారిక

ఒక మనసు చిత్రంతో మెగాఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక కొణిదెల.., సినిమాల్లోకి రాక మునుపే ముద్దపప్పు అవకాయ్ అనే వెబ్ సిరీస్ తో అందరికీ దగ్గరైంది.

ఎన్టీఆర్ సినిమాకు బాలీవుడ్ కెమెరామెన్

జనతాగ్యారేజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వెంటనే సినిమా చేయకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో అన్న కల్యాణ్రామ్ నిర్మాతగా తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.

సాహో ఎన్.బి.కెః ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, బాలకృష్ణ నటించిన 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.

సందీప్ కిషన్ తో సాయిపల్లవి....

మలయాల ముద్దుగుమ్మ సాయిపల్లవి తెలుగు ప్రేమమ్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్తేజ్ హీరోగా రూపొందుతోన్న ఫిదా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

చిరు టార్గెట్ ఇప్పుడదే...

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన చిత్రం `ఖైదీ నంబర్ 150`. విడుదల రోజు నుండి సినిమాపై ఉన్న అంచనాలను మించుతూ కలెక్షన్స్ ను సాధిస్తూ ముందుకెళుతుంది.