వెంకీ - క్రిష్ మూవీ (ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్)
- IndiaGlitz, [Wednesday,December 07 2016]
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం గురు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న గురు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 13న వెంకీ పుట్టినరోజు సందర్భంగా గురు టీజర్ రిలీజ్ చేసి గురు చిత్రాన్ని జనవరి నెలాఖరున రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత వెంకీ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రాన్నిచేయనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీపుత్ర శాతకర్ణి...ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్ వెంకీకి ఇటీవల ఓ కథ చెప్పారట. క్రిష్ చెప్పిన సోషియో ఫాంటసీ కథ విని వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.