హీరో వెంక‌టేశ్‌కి స్వ‌ల్ప‌గాయం

  • IndiaGlitz, [Sunday,August 18 2019]

విక్ట‌రీ వెంక‌టేశ్‌కి షూటింగ్‌లో చిన్న‌పాటి గాయాల‌య్యాయి. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ న‌టిస్తోన్న చిత్రం 'వెంకీమామ‌'. డి.సురేశ్‌బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. బాబీ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వెంక‌టేశ్‌, పాయల్ రాజ్‌పుత్‌ల‌పై రామోజీఫిలిం సిటీలో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆ సంద‌ర్భంలో వెంక‌టేశ్ కాలు స్వ‌ల్పంగా బెణికింది. దీంతో యూనిట్ షూటింగ్‌ను ఆపుచేసింది. వెంకీ గాయాన్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్లు కొన్నిరోజుల విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ట‌.