వెంకటేష్.. రెండు రోజులు

  • IndiaGlitz, [Thursday,December 21 2017]

విక్ట‌రీ వెంక‌టేష్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించిన సినిమాల‌ను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఆ మ‌ధ్య రానా న‌టించిన కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ చిత్రంలో ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసిన వెంకీ.. గ‌తేడాది విడుద‌లైన నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్ చిత్రంలో ఓ అతిథి పాత్ర పోషించారు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సారి ఈ సీనియ‌ర్ క‌థానాయ‌కుడు గెస్ట్ రోల్‌లో సంద‌డి చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత‌కీ ఆ సినిమా ఏమిటంటే.. అజ్ఞాత‌వాసి. ఈ సినిమ‌లో వెంకీ గెస్ట్ రోల్ చేయ‌బోతున్నార‌ని గ‌త కొంత కాలంగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా కోసం ఆయ‌న రెండు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నార‌ని తెలిసింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ, త్రివిక్ర‌మ్‌తోనూ వెంకీకి మంచి అనుబంధ‌మే ఉంది. ప‌వ‌న్‌తో ఇప్ప‌టికే గోపాల గోపాల చేసిన వెంకీ.. త్రివిక్ర‌మ్ (మాట‌ల ర‌చ‌యిత‌గా) కాంబినేష‌న్‌లో నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రి వంటి హిట్ చిత్రాలు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, జ‌న‌వ‌రి 10న అజ్ఞాత‌వాసి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

'అనసూయ' కి 10 ఏళ్లు

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించిన కథానాయికల్లో భూమికా చావ్లా ఒకరు.

'కుమారి 21F' మళ్ళీ రిపీటవుతుందా ?

'కుమారి 21F' లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ అనంతరం ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీటవ్వనుంది.

సినిమా చూశాను.. డెఫనెట్ గా సూపర్ హిట్ అవుతుంది - 'హలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి

యూత్ కింగ్ అఖిల్,కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో అన్నపూర్ణ స్టూడియోస్,'మనం'ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో '

12 ఏళ్ల 'జై చిరంజీవ'

జగదేక వీరుడు అతిలోక సుందరి,చూడాలని ఉంది,ఇంద్ర వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి,

సాయిపల్లవి కల నెరవేరినట్టే

కలలు అందరూ కంటారు.అయితే..కొన్ని కలలు మాత్రమే సాకారం అవుతాయి.